తెలుగు తేజం
  నవ్వులు (2)
 
1. " నిన్ను ఇంతకాలం వెంట పడి ప్రేమా దోమా అంటూ వేధించిన ఆ రమేష్ నే పెళ్ళి చేసుకుందామని ఎందుకు నిర్ణయించుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావదం లేదు " అడిగింది రోజా.

" ఇంత కాలం నా వెంటపడి నన్ను వేధించిన ఆ వెధవను పెళ్ళి చేసుకొని ప్రతీకారం తీర్చుకుంటాను. ఇక బ్రతికినంతకాలం వాడి బ్రతుకు కుడితిలో పడిన ఎలకే !క్షణం క్షణం కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతూ చస్తాడు దొంగ వెధవ " అసలు సంగతి చెప్పింది అయేషా.

2)"డ్రైవర్ ఉద్యోగానికి వచ్చిన దైవాధీనాన్ని ఇంటర్వూ చేసి బాగా ఉద్యోగానికి సరిపోతాడను రూఢీ చేసుకున్నాక " నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాం.అయితే స్టార్టింగ్ శాలరీ రెండు వేలు " అని చెప్పాడు గోవర్ధనం.

"స్టార్టింగ్ చేయడానికి రెండు వేలు అయితే డ్రైవింగ్ చేయడానికి ఎంత శాలరీ ఇస్తారు సార్ ? " ఆశగా అడిగాడు దైవాధీనం.
 

2.“ ఆ దొంగ బస్సులో అంత రష్ లో నీ జాకెట్లో చెయ్యి పెట్టి పర్సు కొట్టెస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావే ? గట్టిగా కేకలు పెట్టి వాడిని పట్టించక పొయ్యావా ?” ఆశ్చర్యం గా అడిగింది రేఖ

“ ఆ దొంగ వెధవ జాకెట్లో చెయ్యి పెట్టింది పర్సు కోసమని నేను అనుకోలేదు, అందులే అరవలేదు” అసలు సంగతి ఐస్ క్రీం తింటూ తాపీగా చెప్పింది సృజన
 

."నాకూ మా ఆవిడకు గొడవ వస్తే కొద్ది నిమిషాలలోనే సమసిపోతుంది తెలుసా !" కాలర్ ఎత్తుకొని గర్వంగా అన్నడు వాలేశ్వరరావు.

" అరే మీరెంతో గ్రేట్ రా! ఆ కిటుకేదో నాక్కూడా చెప్పకుడదా. మా ఇద్దరి మధ్య గొడవ గనుక లేస్తే గంటలకు గంటలు నడుస్తుంది" దీనంగా అడిగాడు పిచ్చేశ్వరరావు.

"ఏముంది, వెరీ సింపుల్. గోడవ మొదలైన వెంటనే మా ఆవిడకు దొరకకుండా నేను మంచం కిందకు దూరిపోతాను. నన్ను పట్టుకోలేక ఆ అప్పడాల కర్రను అవతల పారేసి మా ఆవిడ వెళిపోతుంది. ఆ తర్వాత నేను తాపీగా బయటకు వచ్చి ఆవిడ కోపం తగ్గేవరకు కాళ్ళు పట్టుకునే వుంటాను.అంతే ! ఆవిడ ఐసైపోయి నన్ను క్షమించేస్తుంది." అసలు సంగతి చెప్పాడు వాలేశ్వరరావు.
 

 
  Today, there have been 5 visitors (5 hits) on this page! కాపిరైట్@ సతీష్ పసుపులేటి 2009  
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free