తెలుగు తేజం
  తన గురించి తాను
 
తన గురించి తాను



                     మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే చాలా స్వీట్‌గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్‌గా ఉంటే జీవితంలో ఒక గంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవాళ్లను చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా. చుట్టూ జనం ఉండాలి నాకెప్పుడూ...ఒంటరితనం భరించలేను!


నీకు కోపం కొంచం ఎక్కువ అంటారండి మా ఫ్రెండ్స్.కాని వెంటనే పోతుంది అని కూడా వాళ్లే అంటారు... ఏమిటో ?? .నాలో నాకు నచ్చనిది కోపం ఒకటే.ఇంకొకటండి..Google ఎవరిని ప్రేమించడు...ఎందుకో తెలుసా మీకూ??ప్రేమిస్తే ఎప్ఫుడు ఒక్కరినే ప్రేమించాలి..తన జీవితాన్ని ఎప్పుడు ఒక్కరికే అంకితం చెయ్యడం వాడికి ఎందుకనో ఇష్టం వుండదండి...అందుకే Google ఎప్పుడు ఫ్రీ బర్డ్...! ఇంకా ఏమన్నా మర్చిపోతే చెప్పండి రాసుకుంటా!!!
 
ప్రేమించే మనసు వుంది
మనసులొన మంచి ఉహ వుంది
ఉహల లొకం లొ ఒక ఆశ వుంది
కలసి వుండే కోమలి యెక్కడ వుందొ?
నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి.....


1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు"...

2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...

3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...

4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...

5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...

6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...

7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"... This is sateesh

నా అర్హతలు :-
 
పేరు                                 : పసుపులేటి సతీష్ కుమార్.
ఊరు                                :  మీకు తెలిసిన ఊరే.
బరువు                             : ఆధికం కన్నా తక్కువ, తక్కువ కన్నా ఎక్కువ.
ఎత్తు                                : మీరు అనుకొన్నంత. 
ఇష్టమైన సినిమా               : నా ఆటోగ్రాఫ్ ... స్వీట్ మెమోరీస్
ఇష్టమైన కధానాయకుడు    : పవన్ కళ్యాణ్.
ఇష్టమైన కదానాయకరాలు : నెలకోసారి మారతారు 
ఇష్టమైన క్రీడ                     : చదరంగం 
ఇష్టమైన క్రీడ కారుడు        :  సచిన్ 
ఇష్టమైన క్రీడ కారిణి           : మార్టినా హింగీస్ 
ప్రేమించేది                         : ఇండియాని
ద్వేషించేది                         : పాకిస్తాన్ ని  
అసహ్యించుకొనేది              : ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం
నాకున్న బలం                   : నమ్మకం
కష్టమైనది                         : హీరోయిజం
సులువైనది                        : విలనిజం
ఆచరించేది                         : కామెడియిజం  
ఆశయము                        : నీకు తెలుసు. 
  
 
  Today, there have been 1 visitors (1 hits) on this page! కాపిరైట్@ సతీష్ పసుపులేటి 2009  
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free