తెలుగు తేజం
  కవితలు
 
 

ప్రకృతి
 
   పోలాల నుండి ఇంటికి చేరుతున్న రైతులు,
   వివిధ ఆకారాలలొ బారులు తీరి గూళ్ళు చేరుతున్న పక్షులు, 
   ఆకాసంలో సిందురంలా కనిపిస్తున్న సూర్యుడు,
   సంధ్యా సమయమని పదే పదే గుర్తుచేస్తున్నాయి.

   అదేసమయములో పచ్చని పచ్చిక మీద కొబ్బరిచెట్టు నీడలో స్వేద తీరుతున్న
   అందాల రాశి,
   కొబ్బరి చెట్టుఆకుల మధ్యనుండి వచ్చే సువర్ణచాయ నులివెచ్చని సూర్యకిరణాలు 
   ఆమెకనులలో గుచ్చుకుంటుంటే,
   ఆమెకళ్ళు మిలమిలా ఆర్పుతుంటే ఆమెమోము వర్ణన తీతం.
 
   ఇంతలో సుర్యబింబానికి కాటుక దిద్దినట్లు కారుమబ్బులు అలుముకున్నాయి నింగిలో రంగులవిల్లు ఎక్కుపెట్టినట్లు ఇంద్రధనస్సు ఆకాశానికి వన్నె తెచ్చింది సంగీతంలా వినిపిస్తున్న పక్షుల కిలకిల రావాలు ,
వెండి చినుకులవలె వర్షపు చినుకులు పడుతుంటే,
ఆనందంతో నెమళ్ళు పురివిప్పి సంగీతానికి తగినట్లుగా నాట్యం చేస్తున్నట్లుంది.
 
అటుగావున్న కొలనులో పచ్చనితామరాకులు,
వాటి మద్యలో రంగురంగుల కలువలు,
వాటి మద్య ఖాళీలలో రంగు రంగుల చేపపిల్లలు
ఆడుతున్న దృశ్యం ప్రకృతికే శోభ తెస్తున్నట్లుంది.
 
అంతలో మబ్బులనుండి తొంగి చూస్తూ వస్తున్న
చంద్రుడు వెండి వెన్నెల్ని కురుపిస్తున్నాడు.
సముద్ర తీరంలో వెండివెన్నెల,
పాలసముద్రం నేలపాలయినట్లుంది
.

పాదాల క్రింద పూలు నలిగిపోతాయా !
మెడ లోని చంద్ర హారం గుండె లకి తగులునా !
సుకుమార సుతి మెత్తని పాదాలు కంది పోతాయా !
అన్నట్లుగా మెల్లగా నడిచి వస్తున్న అందాలరాశి.

చల్లని గాలికి ఎగురుతున్న నల్లని కురులు,
గట్లు తెంచుకున్న నది పాయలవలె ప్రవహిస్తున్నాయి
చంద్రుని కాంతి ఆమె వజ్రపు ముక్కు పుడక పై పడి మోము ప్రకాశంతో వెలిగిపోతుంది
ఆలకిస్తున్నట్లుగా ఊగుతూ చెక్కిళ్ళను తాకుతున్న లోలకలు. రమణీయమైన ప్రకృతిని తలపిస్తున్నాయి.                                                                ---సతీష్
***************************************************************
 స్నేహo
 
స్నేహమా, ఓ స్నేహమా...
నీలాకాశంలో మబ్బులా,
సముద్రంలో అలలా,
నాతోడు వస్తావా, నన్ను నడిపిస్తావా! 

          స్నేహమా, ఓ స్నేహమా... వెన్నెలలో నీడలా, 
          నింగిలో చందమామలా,
          నాతోడు వస్తావా,
          నా చెంత నిలుస్తావా!                        
                 --సతీష్ ***************************************************************

              నా డైరిలో ఒక పేజి (1st జనవరి2003)

                  డిగ్రీ అయిపోతుందన్న సంతోషం, స్నేహితులను విడిపోతున్నమన్న దుఃఖము వలన కళ్ళ నుడి వచ్చిన దుఖానంద కన్నీటిని కలములో నింపి వ్రాసినది. అభిలాష:- అబిమానం, ఇష్టం కలిస్తే స్నేహం ఏర్పడుతుంది.            
              
           నమ్మకం,ఇష్టం కలిస్తే ప్రేమ పుడుతుంది. అంతేగాని ఒక్కసారిగా ప్రేమ కలగదు. స్నేహం కలగదు. స్నేహం బంధంగా ఏర్పడి మనస్సులు రెండు స్పందించి, ఇద్దరి ఆలోచనలు,అభిప్రాయాలు బలపడి ఒకరిపై ఒకరికి ఏర్పడిన ఇష్టమే ప్రేమ. అని నేను భావిస్తున్నాను. 

           ఇలాంటి ప్రేమ నిజమైనది.ఎన్ని కష్టాలు వచినా ఒకటిగా చేస్తుంది. నా మదిలోని భావాలూ ఎలా తెలపాలో తెలియక ఇలా వ్రాస్తున్నాను. తప్పుగా ప్రవర్తిస్తే మంచి మనస్సుతో క్షమించు. 

            ప్రతి మనిషి ఒక్కసారి అయినా ప్రేమిస్తాడు.అది ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో,ఎవరితోజరుగుతుందో ఊహించలేము,చెప్పలేము. మనస్సు నుండి మనకు తెలియకుండా జరిగిన హృదయస్పందనే ప్రేమంటే కాని ప్రేమ అన్ని విధాల మంచిది చెడ్డది గాయపరుస్తుంది గాయాన్ని నయం చేస్తుంది కన్నీటిని రప్పిస్తుంది ఆనందబాష్పాలు కురిపిస్తుంది ఆకలినిపెంచుతుంది ఆకలిని తగ్గిస్తుంది అన్నివిధాలా మనిషి లో సగబగమై నిలిచిపోతుంది . కాని నిజమైన ప్రేమకు కావలసింది అందం ఆకర్షణ కాదు నమ్మకం కావాలి ఒక మనషికి మారో మనిషి పై నమ్మకం ఏర్పడితే ప్రేమ పుడుతుంది నమ్మకం లేకుండా ప్రేమకలగదు కలిగినా నిలవదు స్నేహం ఇష్టం నమ్మకం అబిమానం అభిరుచి ముందుగా పుట్టినతరువాతే ప్రేమ పుడుతుంది . 

           మనసున వున్నది చెప్పాలని వున్నది మాటలు రావే ఎలా !అందుకే ఇలా వ్రాస్తున్నాను ..... 

    డియర్ ...   నామనసులోని బావాన్ని ఎలా తెలియజేయాలో తెలియక నేను నిన్ను నిజాంగా ప్రేమిస్తున్నానని ఎలా తెలియజేయాలో అని ఆలోచిస్థు గడుపుతున్నాను నా మనస్సులో నీ పై గల ప్రేమ అంతటిని అక్షర రూపంలో వ్రాస్తూ కాలం గడుపుతున్నాను నేను ఎదురుగా నీతో నా మనస్సులోని ప్రేమను తెలియజేస్తే అది నీవు ఆంగికరించకపోతే ,నీవు నన్ను ప్రేమించలేను అని చెబితే భరించలేను. మన ఇద్దరికీ గతంలో ఎన్నడు స్నేహం లేదు. కాని ఏ క్షణంలో అయితే నిన్ను చూసానో, ఆరోజునుండి నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. కాని దైర్యం చాలడములేదు.అలాగని పిరికివాడిని మాత్రం కాదు. 

            ఈ విషయాలు అన్ని నీకు తెలిసిన తరువాత నీవు అయిష్టము తెలిపితే అది నేను భరించలేను. నీవు ఎవ్వరితోనైన మాట్లాడుతున్నా, నవ్వుతున్నా,నడుస్తున్నా, మౌనంగా నా వంక చూస్తున్నా,నిముఖంలో చెదరని చిరునవ్వు నా మనస్సుకు బాగా నచ్చింది. కాంతి వేగము కంటే వేగమైన నిచూపు, కల్మషం లేని ఆ చిరునవ్వులో అమాయకత్వం ఉంది. అదే నేను నిన్ను అంతగా ఇష్టపడడానికి కారణం. 

                             ఒక్కసారయినా, ఒక్క నిముషం అయినా నీతో మాట్లాడలేకపోతున్నాను, అనే అశాంతి నా మనస్సుకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నడిచింత సేపు నీతోనే నడవాలని, మాట్లాడినంత సేపు నీతోనే మాట్లాడాలని, ఆలోచించినంతసేపు ని గురించే ఆలోచించాలని, చూసినంతసేపు నీ కళ్ళలోనే చుడాలని, వ్రాసినంతసేపు నిగురించే వ్రాస్తున్నాను ..............తప్పా! తప్పు కాదని నీకు తెలుసు. 

                  ఇప్పుడిప్పుడే నాగురించి నిగుండే చప్పుడు చేస్తుంది. ఆకాశములో ఎన్నో తారలు ఉండవచ్చుగాని చంద్రుడు అందము. అలాగే ప్రపంచములో ఎంతోమంది అందగత్తెలు ఉండవచ్చు కాని నువ్వే నాకు అందగత్తేవి. నేను నిద్రపోతున్నాను కాని నిద్ర పట్టడము లేదు కారణం నివు నాకళ్ళలోనే మెదులుతున్నావు. నీ సమాధానం చెప్పు.                                                  ......... సతీష్ ***************************************************************
 
  Today, there have been 1 visitors (1 hits) on this page! కాపిరైట్@ సతీష్ పసుపులేటి 2009  
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free